
భారతీయుడు 2 డిజాస్టర్ కావటంతో కమల్ సినిమాల లైనప్ విషయంలో కన్‌ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. ప్రజెంట్ భారతీయుడు 3తో పాటు థగ్ లైఫ్ సినిమాలతో బిజీగా ఉన్నారు కమల్. ఈ రెండు సినిమాలు దాదాపు ఫైనల్ స్టేజ్‌లోనే ఉన్నాయి.

దీంతో ఏ సినిమాను ముందు రిలీజ్ చేయాలన్న విషయంలో డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారతీయుడు 2 దారుణంగా ఫెయిలయ్యింది. దీంతో నెక్ట్స్ మూవీ విషయంలో ఆలోచనలో పడ్డారు కమల్.

భారతీయుడు 2 రిలీజ్ తరువాత షార్ట్ గ్యాప్‌లోనే పార్ట్ 3ని కూడా రిలీజ్ చేయాలని భావించినా... ఇప్పుడు ఆ నిర్ణయం విషయంలో రీ థింక్ చేస్తున్నారు. భారతీయుడు 3ని ఈ ఏడాది చివర్లో లేదా, నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్‌లో రిలీజ్ చేయాలన్నది మొదట అనుకున్న ప్లాన్.

కానీ పార్ట్ 2 డిజాస్టర్ కావటంతో ఇప్పుడు త్రీక్వెల్ విషయంలో ఇంకా ఏదైనా రీ వర్క్ చేయాలా అన్న ఆలోచనలో పడ్డారు మేకర్స్. భారతీయుడు 3 ఈ ఇయర్‌లోనే రిలీజ్ అయితే థగ్ లైఫ్‌ను నెక్ట్స్ ఇయర్ స్టార్టింగ్‌లోనే రిలీజ్ చేసేలా ముందు ప్లాన్ చేసుకున్నారు.

కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఆలస్యమయ్యేలా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో రిలీజ్ లైనప్ విషయంలో కూడా చేంజెస్ చేసే ఆలోచనలో ఉంది కమల్ టీమ్. భారతీయుడు 3 కన్నా ముందు థగ్ లైఫ్‌ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు కమల్.

2025 ఫస్ట్ క్వార్టర్‌లోనే థగ్ లైఫ్‌ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చి, ఆ తరువాత సమ్మర్ సీజన్‌లో భారతీయుడు 3 రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారు. మరి ఫైనల్‌గా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.