కుమారి 21 ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకుంది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్. అంతకు ముందు వరుణ్ సందేష్ తో కలిసి అలా ఎలా అనే సినిమా చేసింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది ఈ వయ్యారి.