
రామ్ చరణ్ ఫామ్ హౌస్ లో గుర్రాలు, పక్షులతో పాటు చాలా పెంపుడు జంతువులు ఉన్నాయి. అయినా సరే చెర్రీకి కుక్కలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అతనికి తన కుక్క బ్రాట్ అంటే చాలా ఇష్టం.

మెగాస్టార్ చిరంజీవి తనయుడు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 38వ పుట్టిని జరుపుకుంటున్నాడు. తాజాగా RRR థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది

రామ్ చరణ్ జంతువులను అమితంగా ప్రేమిస్తాడు. తాజా సూపర్‌హిట్ చిత్రం RRR ప్రమోషన్ సమయంలో, అతను తన కుక్క 'రహీమ్'తో కనిపించాడు.

రామ్ చరణ్ చాలా సార్లు తన కుక్కలతో సెలవులకు వెళ్తాడు. సోషల్ మీడియాలో చాలాసార్లు తన పెంపుడు జంవుతులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తాడు.

రామ్ చరణ్, ఉపాసన దంపతులు జంతువుల కోసం రకరకాల దానధర్మాలు చేస్తారు. తాజాగా రామ్‌చరణ్, ఆయన భార్య ఉపాసన ఏనుగును దత్తత తీసుకున్నారు.