
రీసెంట్ టైమ్స్‌లో భారీ చిత్రాలు చెప్పిన టైమ్‌కు ఆడియన్స్ ముందుకు రావటం అన్నది గగనంగా మారిపోయింది. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్‌లో భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న సినిమాలు రిలీజ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ఆన్ టైమ్‌లో గ్రాఫిక్స్ వర్క్ రాక.. పదే పదే రిలీజ్ వాయిదా వేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాయి మూవీస్. హీరో రేంజ్‌తో సంబంధం లేకుండా గ్రాఫిక్స్ వర్క్ ఇన్వాల్ అయిన సినిమాలు చాలా కాలం సెట్స్ మీదే ఉండిపోతున్నాయి. చిరంజీవి విశ్వంభర నుంచి నిఖిల్ స్వయంభూ వరకు, ఇలా గ్రాఫిక్స్ వర్క్ వల్ల డిలే అవుతున్న సినిమాలు చాలానే కనిపిస్తున్నాయి.

ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లటంలో విజువల్ ఎఫెక్ట్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్, హిస్టరికల్ సినిమాల తెరకెక్కిచటంలో గ్రాఫిక్స్‌దే కీలక పాత్ర. అందుకే మేకర్స్ ఆ క్రాఫ్ట్ మీద ఎక్కువ టైమ్ కేటాయించటంతో పాటు భారీగా ఖర్చు చేస్తున్నారు. కానీ అన్ని సందర్భాల్లో నిర్మాత డబ్బుకు సరైన న్యాయం జరగటం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. గ్రాఫిక్స్ విషయంలో విమర్శలు తప్పటం లేదు.

గ్రాఫిక్స్ వల్ల ఆలస్యమైన సినిమాలు ఓటీటీ డీల్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చెప్పిన టైమ్‌కు సినిమా రిలీజ్ కాకపోవటంతో ముందు ఒప్పుకున్న ఎమౌంట్ పే చేసే విషయంలో ఓటీటీ సంస్థలు కూడా భేరమాడుతున్నాయి. ఇటీవల కాలంలో ఒకటి రెండు పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాయి. మరి ఈ పరిస్థితులను ఓవర్ కమ్ చేసేందుకు మన మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.