Ram charan: రామ్ చరణ్ పై స్పెషల్ ఫోకస్.. బుచ్చిబాబు మూవీపై ఆసక్తి రేపుతున్న సీన్.
స్టార్ హీరోల సినిమాలన్నాక ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ఎందుకుంటున్నా. సెట్స్ మీదుంటే ఒక రకమైన క్రేజ్, అనౌన్స్ మెంట్ అయితే ఇంకో క్రేజ్. ఆల్రెడీ అనౌన్స్ అయిన సినిమాలకు సంబంధించి ఏ అప్‌డేట్ వచ్చినా ఫ్యాన్స్ కి అయితే ఫెస్టివలే. ఇప్పుడు అలాంటి ఫెస్టివ్ మూడ్‌లోనే ఉన్నారు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ అభిమానులు. రామ్‌చరణ్ ఇంకా ట్రిపుల్ ఆర్ కోసం ఆస్కార్ ప్రాంగణంలో తిరుగుతున్నట్టే ఉంది. ఆ సందడిని ఇంకా ఫ్యాన్స్ మర్చిపోనే లేదు.