- Telugu News Photo Gallery Cinema photos Global actress Priyanka Chopra Shocking Comments about RRR Movie Telugu Entertainment News
Priyanka Chopra: హర్ట్ అయ్యామిక్కడ.. ప్రియాంక చోప్రాపై మండిపడుతున్న ఎన్టీఆర్- చెర్రీ ఫ్యాన్స్.
కావాలనే అలా చేస్తున్నారో.. లేకపోతే అనుకోకుండా అలా అనేస్తున్నారోగాని.. పదే పదే ట్రిపులార్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తున్నారు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. అదేంటి అసలు ప్రియాంకకు ట్రిపులార్ ఫ్యాన్స్‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.
Updated on: May 18, 2023 | 7:59 PM

కావాలనే అలా చేస్తున్నారో.. లేకపోతే అనుకోకుండా అలా అనేస్తున్నారోగాని.. పదే పదే ట్రిపులార్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తున్నారు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. అదేంటి అసలు ప్రియాంకకు ట్రిపులార్ ఫ్యాన్స్‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక చోప్రా పూర్తిగా మకాం అక్కడికే మార్చేశారు. అడపాదడపా ఇండియన్ సినిమాలు చేయటమే తప్ప ఫుల్ టైమ్ హాలీవుడ్ యాక్ట్రసెస్‌గానే కొనసాగుతున్నారు.

ఆ మధ్యయితే అసలు ఇండియన్ స్క్రీన్ మీద కనిపించటమే మానేశారు ఈ బ్యూటీ. కానీ మన సినిమా గ్లోబల్ రేంజ్‌కు వెళుతుండటంతో ఈ మధ్యే మళ్లీ హిందీ ఇండస్ట్రీతో మింగిల్ అవుతున్నారు.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రియాంక, ట్రిపులార్ ను తమిళ సినిమాగా కోట్ చేశారు. దీంతో ఇండియన్ అయి ఉండి ఓ ఇండియన్ సినిమా గురించి మినిమమ్ నాలెడ్జ్ లేకుండా ఎలా కామెంట్ చేస్తావంటూ ప్రియాంకను ట్రోల్ చేశారు తెలుగు ఆడియన్స్.

తాజాగా మరోసారి తారక్, చెర్రీ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించారు ప్రియాంక చోప్రా. రీసెంట్ ఇంటర్వ్యూలో తాను ట్రిపులార్ సినిమా చూడలేదని.. అంత టైమ్ తనకు లేదని చెప్పారు.

హాలీవుడ్ లెజెండ్స్ స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్ లాంటి వాళ్లే ట్రిపులార్ సినిమాను చూసి ప్రశంసిస్తే.. ప్రియాంక మాత్రం టైమ్ లేదని చెప్పటం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆడియన్స్.

పీసీ చేస్తున్న ఈ కామెంట్స్ విషయంలో మరో వర్షన్ కూడా వినిపిస్తోంది. కావాలనే ఈ గ్లోబల్ బ్యూటీ ట్రిపులార్ లాంటి బిగ్ మూవీస్‌పై కామెంట్స్ చేస్తున్నారా అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి.

మళ్లీ బాలీవుడ్‌లో బిజీ కావాలనుకుంటున్న పీసీ.. ఇక్కడి ప్రేక్షకుల దృష్టిలో పడేందుకే ఇలా చేస్తున్నారన్న కంప్లయింట్స్ తెర మీదకు వస్తున్నాయి.

మరి ఈ ట్రోల్స్‌పై ప్రియాంక ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.





























