
ఏది ధర్మం.. నీకు జన్మను దర్మం చేసింది ఆడది.. మాటలంటున్న నీ నోట మొదటిమాట నేర్పింది ఆడది.. ఆడదాని కడుపున నలిగి నలిగి వెలుగుచూసిన రక్తపు ముద్దవి.. నీకున్న అర్హత నీ తల్లికి లేదా.. నేను అగ్రతాములం ఇస్తుంది మా అమ్మకే కాదు అమ్మకి. నాస్తి వేదాత్ పరం శాస్త్రం.. నాస్తి మాతృ సమోగురు.. నాస్తి మాతృ సమా పూజ్యః..నాస్తి మాతృ సమా సఖ.. తండ్రిని మించిన కొడుకులుంటారు.. తల్లిని మించిన కొడుకున్నాడా.. ఉంటె చెప్పండి అగరుబూజనిస్తాను.

బడుకుజాతి కాదు, తెలుగుజాతి. అధములం కాదు, ప్రథములం. ఈ విశాల దేశాన్ని బుజాలపై మోస్తున్న పునాదులం, వీరులం, వేదభూమి వేరులం. వేట మొదలుకాక మునుపే కోట వదిలిపో లేదా పరిగెత్తే మీ ప్రాణాలని పరమాత్ముడు కూడా ఆపలేడు.

ఇప్పటికి ఉనికి నిలుపుకున్నాం. ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని పరదేశపు నెత్తురుతో ప్రక్షాళన చేద్దాం. దొరికిన వాణ్ణి తురుముదాం. దొరకని వాణ్ణి తరుముదాం. ఏది ఏమైనా దేశం మేసం తిప్పుతాం.

మిత్రమా ఇది మా గత వాదనతో రక్తసిక్తమైన కుంతల దేశ రణభూమి నుంచి పంపుతున్న లేఖ. మీకు మా స్నేహపూర్వక హెచ్చరిక.. ఇప్పుడు కుంతల మా సొంతమైంది. 18 మాసాలుగా మా కత్తి కంటే నెత్తురు చార ఇంకా పచ్చిగానే ఉంది. విశ్రాంతి లేదు.. విరామం లేదు.. దండయాత్రకులనే ప్రయాణిస్తూనే ఉన్నాను. నేటికీ కన్యాణ దుర్గం, మీ సౌరాష్ట్ర రాజ్యాలు తప్ప తక్కిన దక్షిణ పదమంతా మాకు దక్కిందని సగర్వంగా చాటుతునన్నాం. ఇట్లు శాతమాన సార్వభౌమ శాతకర్ణి.

ఈ దేశం ఉమ్మడి కుటుంబం. గదికి గదికి మధ్య గోడలుంటాయి, గొడవలుంటాయి. ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం. కానీ ఎవడో వచ్చి నాదంటే ఎగరేసి నరుకుతాం. మేము ఎవరి జోలికి వెళ్లం. మా జోలికి ఎవరు వచ్చినా వదలం. సరిహద్దు దగ్గరే మీకో స్మశానం నిర్మిస్తాం. మీ ముండాల మీద మా జెండాని ఎగరేస్తాం. ఇక యుద్ధం నాస్తి. ఈ గడ్డ మీద పరిపాలన స్వస్తి.