
వినాయక నవరాత్రుల ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నారు.

జబర్దస్త్ నటుడు, ప్రముఖ కమెడియన్ అవినాష్ ఇంట్లోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అవినాష్ తో పాటు అతని భార్య అనూజ, సోదరుడు అజయ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

అలాగే మరో బుల్లితెర నటి, జబర్దస్త్ లేడీ కమెడియన్ పవిత్ర కూడా అవినాష్ ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో తళుక్కుమంది.

ఈ సందర్భంగా అందరూ సంప్రదాయ దుస్తులు ధరించి వినాయకుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అవినాశ్

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు లైకులు, షేర్స్, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాశ్. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో మరింత ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ప్రసాద్ అంటూ హీరోగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.