
దివంగత హీరోయిన్ శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. 2018లో ధడక్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది.

ఇప్పటివరకు ఆరు చిత్రాల్లో నటించిన జాన్వీ నటనపరంగా సినీ విశ్లేషకుల ప్రశంసలు అందుకుంది. గ్లామర్, ఢీగ్లామర్ తేడా లేకుండా కంటెంట్ దృష్టిలో పెట్టుకుని సినిమాలను ఎంచుకుంటుంది.

మార్చి 6న జాన్వీ 26వ పుట్టినరోజు జరుపుకుంటోది. ఈ నేపథ్యంలోనే తన ఫేవరెట్ హీరో ఎన్టీఆర్ పక్కన నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తనకు తెలుగులో ఎన్టీఆర్ అంటే ఇష్టమని.. ఆయన పక్కన నటించాలని ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టేసింది. అంతేకాకుండా ఆఫర్స్ వస్తే తాను సౌత్ మూవీస్ చేయడానికి సిద్ధమని తెలిపింది.

తాజాగా ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో రాబోతున్న NTR 30లో ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఈ సినిమా నుంచి జాన్వీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

మరి యంగ్ టైగర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతున్న ఈ అతిలోక సుందరి తనయ తెలుగులో సత్తా చాటుతుందో లేదో చూడాలి.

ఎట్టకేలకు జాన్వీ కోరిక నెరవేరిందోచ్.. ఫేవరెట్ హీరో సరసనే ఛాన్స్ కొట్టేసిన అందాల ముద్దుగుమ్మ..

ఎట్టకేలకు జాన్వీ కోరిక నెరవేరిందోచ్.. ఫేవరెట్ హీరో సరసనే ఛాన్స్ కొట్టేసిన అందాల ముద్దుగుమ్మ..

ఎట్టకేలకు జాన్వీ కోరిక నెరవేరిందోచ్.. ఫేవరెట్ హీరో సరసనే ఛాన్స్ కొట్టేసిన అందాల ముద్దుగుమ్మ..