
ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుతో కంటే.. 'చిట్టి' పేరుతో బాగా ఫేమస్ అయింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా.

పాతికేళ్ల ఈ హైదరాబాదీ భామ.. నవీన్ పొలిశెట్టి హీరోగా దర్శకుడు కెవి అనుదీప్ తెరకెక్కించిన 'జాతిరత్నాలు'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత అఖిల్ అక్కినేని హీరోగా వచ్చిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'లో ఓ గెస్ట్ రోల్‌లో కనిపించింది.

తన మొదటి సినిమా 'జాతిరత్నాలు'తోనే ఇండస్ట్రీ హిట్ దక్కించుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత మరే హిట్ దక్కించుకోలేకపోయింది.

'రావణాసుర', 'లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్', 'వల్లిమయిల్', 'బంగార్రాజు' లాంటివి ఫరియా కెరీర్‌లో చెప్పుకోదగ్గ చిత్రాలు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్ల గుండెలను మెలిపెట్టేస్తోంది.

ఫరియా రాబోయే సినిమాల కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.. కామెంట్స్ లో మూవీ అప్డేట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.