
మేం మాలాగే ఉంటాం... మేం ఇలాగే చేస్తాం అంటే జీ హుజూర్ అనదలచుకోవడం లేదు ఆడియన్స్. సోషల్ మీడియా పెరిగిన ఈ సమయంలో, ఎవరేం చేసినా చిటికెలో రివ్యూలిచ్చేస్తున్నారు. ఎక్కడో చూసిన విషయాలకే అంతగా రియాక్ట్ అవుతున్నవారు, డబ్బులు పెట్టి థియేటర్లలో చూసిన సినిమాల విషయంలో ఆగుతారా? కాస్త అటూ ఇటూగా ఉంటే ఊరుకుంటారా?

ఇస్మార్ట్ శంకర్ సైలెంట్ హిట్ అయింది. ఎవరూ ఆ సినిమాను ఆ రేంజ్‌లో ఊహించలేదు. మాస్ మసాలా మూవీగా మెప్పించింది. రామ్ పోతినేనిని మాస్ హీరోగా నిలబెట్టింది. అలాగని ఇప్పుడు చేసిన డబుల్ ఇస్మార్ట్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా అలాగే ఉండేలా తీస్తామంటే జనాలు ఒప్పుకుంటారా? తీసిన జిరాక్స్ కూడా చక్కగా రాలేదని కామెంట్లు చేస్తున్నారు. పోకిరి లాంటి సినిమా చేసిన కెప్టెన్ తీయాల్సిన సినిమా ఇదేనా అంటూ పెదవి విరుస్తున్నారు.

గత కొన్నాళ్లుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న పూరి జగన్నాథ్ - రామ్ కలలన్నీ కల్లలైపోయాయి. డబుల్ ఇస్మార్ట్ కన్నా ముందే షోలు పడ్డ మూవీ మిస్టర్ బచ్చన్. కమర్షియల్ హిట్ పక్కా అంటూ షోలు వేశారు. కానీ అప్పటి నుంచే నెగటివ్ టాక్ మొదలైంది.

ఆల్రెడీ గబ్బర్‌సింగ్‌లో పెట్టిన అంత్యాక్షరి తరహా సన్నివేశాలను మళ్లీ ఎందుకు ప్లాన్ చేశారు? చేస్తే చేశారు... హిందీ పాటల కచేరీ ఏంటి? అంటూ తన ఒపీనియన్‌ని బేఫికర్‌గా చెబుతున్నారు ఆడియన్స్.

దానికి తోడు పాటలో వల్గర్‌గా కంపోజ్ చేసిన స్టెప్పుల గురించి కూడా దుమారం రేగుతోంది. సినిమాల రిజల్ట్ విషయం పక్కనపెడితే, ఈ విషయం మాత్రం బాగా వైరల్ అవుతోంది.