- Telugu News Photo Gallery Cinema photos Actress Sangeetha says Telugu industry is better than Tamil industry
Sangeetha: తమిళ్ కంటే తెలుగే బెటర్.. ఇక్కడ గౌరవం ఉంటుంది..: హీరోయిన్ సంగీత
సినీ ఇండస్ట్రీలో నటి మంచి గుర్తిపు తెచ్చుకున్న నటి సంగీత. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. సంగీత అసలు పేరు రసిక. నటిగా మారిన తర్వాత ఆమె పేరు మార్చుకుంది. సంగీత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది.
Updated on: Aug 19, 2024 | 9:02 PM

సినీ ఇండస్ట్రీలో నటి మంచి గుర్తిపు తెచ్చుకున్న నటి సంగీత. ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఈ చిన్నది. సంగీత అసలు పేరు రసిక. నటిగా మారిన తర్వాత ఆమె పేరు మార్చుకుంది. సంగీత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో నటించింది.

ఆశలసందడి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయం అయ్యింది సంగీత. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. 2002లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాతో పాపులారిటీ సొంతం చేసుకుంది.

పెళ్ళాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, నేను పెళ్ళికి రెడీ, అదిరిందయ్యా చంద్రంలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది సంగీత. అలాగే 2010 తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో హీరోయిన్ తల్లిగా నటించింది. మసూద సినిమాలోనూ నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంగీత మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను తమిళంలో ఎక్కువ సినిమాలు చేయడం లేదు.

ఎందుకంటే తమిళ్ కంటే తెలుగులో చాలా గౌరవం ఉంటుంది. అలాగే తమిళం కంటే తెలుగులో అవకాశాలు, పారితోషికం బాగానే ఉన్నాయి. తమిళ సినిమాలో నటించాలనుకుంటున్నాను అని ఫోన్ చేస్తే మొదట మర్యాద లేకుండా మాట్లాడేవారు అని చెప్పుకొచ్చింది సంగీత.




