
కొన్ని సినిమాలపై ఉన్న అంచనాలు చూస్తుంటే తీసేవాళ్లకు భయమేస్తుంది. అయితే అలాంటి సినిమాలు తరుచుగా కాదు.. అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడో సినిమాపై ఇలాంటి ఫోబియానే నడుస్తుంది.

ఎక్కడికెళ్ళినా.. ఏం చేసినా.. ఎవరిని కదిపినా ఆ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దాని అప్‌డేట్సే కావాలంటున్నారు. ఈ ఒక్క టీజర్ ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు తారకమంత్రంలా మారిపోయింది.

మరోవైపు ఆయన లేని సీన్స్ షూట్ చేసుకుంటున్నారు దర్శకులు. హరిహర వీరమల్లు విషయంలో ఇదే జరుగుతుంది. దాదాపు 1000 మందితో ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్నారు మేకర్స్. పవన్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు.

ఎప్పుడొస్తుందో తెలియదు.. పవన్ డేట్స్ ఎప్పుడిస్తారో ఐడియా లేదు.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేదు.. అయినా కూడా ఓజి ఫీవర్ మామూలుగా లేదు. నిర్మాత దానయ్య ఎక్కడ కనిపించినా ఓజి ఓజి అంటూ మోత మోగిస్తున్నారు ఫ్యాన్స్.

త్వరలోనే ఓజి తుఫాన్ వస్తుందంటూ ట్వీట్ చేసారీయన. సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజి షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తైంది. 15 రోజులు పవన్ డేట్స్ ఇస్తే చాలు సినిమా రిలీజ్ అయిపోతుంది. సరిగ్గా 2023 పవన్ పుట్టిన రోజు కానుకగా ఓజి టీజర్ విడుదల చేసారు మేకర్స్.

ఈ సారి మరో స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే స్పెషల్‌గా ఓజి ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. టీజర్‌లో వచ్చిన హంగ్రీ ఛీతా సాంగ్ వైరల్ అయింది. టీజర్ వచ్చి ఏడాదైనా ఇప్పటికీ ఆ పాట పవర్ తగ్గలేదు.

తాజాగా థమన్ ట్వీట్ చేసారు కాబట్టి కచ్చితంగా ఫస్ట్ సాంగ్ అప్‌డేట్ ఉంటుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇక వీరమల్లు నుంచి ఓ టీజర్ వచ్చే అవకాశాలు కొట్టి పారేయలేం. ఉస్తాద్ భగత్ సింగ్ అప్‌డేట్‌పై హరీష్ శంకర్ క్లారిటీ ఇవ్వాల్సిందే..!