- Telugu News Photo Gallery Cinema photos Fans fire on director for not giving clarity on Spirit movie
ప్రభాస్ మూవీపై క్లారిటీ ఇవ్వని డైరెక్టర్.. ఫ్యాన్స్ ఏం చేస్తున్నారంటే?
ఖాన్‌తో గేమ్స్ ఆడకు.. శాల్తీలు లేచిపోతాయ్.. అనేది అప్పుడెప్పుడో బ్రహ్మీ చెప్పిన డైలాగ్. ఫ్యాన్స్ దగ్గర లేట్ చేయకు,కొత్త వీడియోలు వైరల్ అవుతాయి అనేది ఇప్పుడు ట్రెండ్‌లో కనిపిస్తున్న విషయం. స్పిరిట్ సినిమా ముహూర్తం ఎప్పుడో.. ఏమిటో సందీప్ రెడ్డి వంగా ఇంకా చెప్పలేదు. అప్పుడే ఫ్యాన్స్ వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారు.
Updated on: Feb 19, 2025 | 12:57 PM

అదీ సంగతి.. డార్లింగ్ ప్రభాస్‌తో సందీప్ రెడ్డి వంగా డైరక్ట్ చేస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు ప్రభాస్.

అయితే సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ముహూర్తం ఎప్పుడనే విషయాల మీద సందీప్ అప్డేట్ ఇవ్వడం లేదు.. దాంతో ఎవరికి తోచిన విధంగా వారు వీడియో ఎడిట్ చేస్తూ వైరల్ చేసుకుంటున్నారు.

హాలీవుడ్ యాక్టర్ డాన్లీ వర్సెస్ ప్రభాస్ కట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వారిద్దరి సినిమాల్లోని క్లిప్స్ తీసి క్రిస్ప్ గా ఎడిట్ చేసినవి కొన్ని కాగా, డాన్లీ యాటిట్యూడ్‌ని ఎలివేట్ చేసే కట్స్ కూడా బాగానే రొటేట్ అవుతున్నాయి.

ఇప్పుడే కాదు.. గతంలోనూ ప్రభాస్ విషయంలో ఇలాంటి వీడియోలు కనిపించాయి. ప్రభాస్‌ని అనుష్క పెళ్లి చేసుకుంటే, వారికో పాప పుడితే ఆ పాప ఎలా ఉంటుంది? అని ఊహిస్తూ క్రియేట్ చేసిన రకరకాల క్లిప్సింగ్స్ వైరల్ అయ్యాయి.

డార్లింగ్ తన పనులతో తాను బిజీగా ఉంటే, ఫ్యాన్స్ ఈ రకంగా పండగ చేసుకుంటున్నారంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు.
