పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగు ఆడియన్స్‌కు బాగా చేరువయ్యారు ఫహాద్ ఫాజిల్. ఈయనకిప్పుడు ఓ అరుదైన వ్యాధి వచ్చింది. అది తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. అసలు పుష్ప విలన్‌కు ఏమైంది..? ఆయనకు వచ్చిన అరుదైన వ్యాధి ఏంటి..? 41 ఏళ్ల వయసులోనే వింత వ్యాధి బారిన ఎలా పడ్డారు..? దానికి చికిత్స ఏంటి..?
కరోనా పుణ్యమా అని మలయాళ హీరోలు కూడా మన హీరోలైపోయారు. ఓటిటిల్లో ఆ సినిమాలు తెలుగులో బాగా క్లిక్ అయ్యాయి. అలా మనకు బాగా చేరువైన హీరో ఫహాద్ ఫాజిల్. ఇక పుష్పలో షెకావత్ పాత్రతో సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది ఈ హీరోకు.
ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్న ఫహాద్‌కు ADHD అనే అరుదైన వ్యాధి సోకింది. సాధారణంగా చిన్న పిల్లలో ఎక్కువగా కనిపించే ADHD అనే సమస్య.. ఇప్పుడు ఫహాద్‌లో కనిపించింది. దీని వల్ల ఎక్కువ సేపు దేని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం, ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం, తొందరగా ఆవేశపడడం లాంటి సమస్యలు వస్తాయని చెప్పారు ఫహాద్ ఫాజిల్.
ఇలాంటి లక్షణాలు తనలో ఉండటంతో.. వైద్యుడిని సంప్రదిస్తే ఆ సమస్య బయటపడినట్లు ఫహద్ తెలిపారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో చెప్పడానికి నిర్దిష్టమైన కారణాలు ఏమీ లేవని వైద్యులు చెప్పినట్లు తెలిపారు ఫహాద్.
దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని.. జాగ్రత్తగా ఉండటమే దీనికి పరిష్కారం అంటున్నారు ఈ హీరో. ఫహాద్‌కు ఇలాంటి అరుదైన వ్యాధి సోకిందని తెలిసాక కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఆయన త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.