అనుమానాలుంటే పక్కనబెట్టండి.. ఆలస్యమైందని అలగకండి.. ఫస్ట్ ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ మరిచిపోండి.. అన్నీ మారాయి.. ఇన్నాళ్లూ ఒక లెక్క ఇప్పట్నుంచి ఒక లెక్క.. కొడితే బాక్సాఫీస్ బద్దలైపోవాల్సిందే..! సలార్ రిలీజ్ ట్రైలర్ చూసాక ప్రభాస్ ఫ్యాన్స్ ఇదే అంటున్నారిప్పుడు. అంతగా ఈ ట్రైలర్‌లో ఏం చూపించారు..? ఫస్ట్ ట్రైలర్‌లో మిస్సైన అంశాలు ఏం కవర్ చేసారు..?
నిజానికి సలార్ ట్రైలర్ 3.47 నిమిషాలున్నా కూడా ప్రభాస్ అభిమానులకు కూడా అంతగా కిక్ ఇవ్వలేదు. దానికి కారణం ప్రభాస్ కేవలం 1 నిమిషం కూడా కనిపించకపోవడమే. అందుకే రిలీజ్‌కు ముందు పండగ లాంటి మరో ట్రైలర్‌ను విడుదల చేసారు. ఇది చూసాక.. అభిమానులకు ప్రాణాలు లేచొచ్చాయి. 2.54 నిమిషాల ట్రైలర్‌లో పూనకాలు పుట్టించారు ప్రశాంత్ నీల్.
ఇలా కదా.. ప్రభాస్‌ను మేం చూడాలనుకుంటున్నది.. ఆ కటౌట్ చూడండి అదిరిపోయింది అంటూ పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ముఖ్యంగా ట్రైలర్‌లో కొన్ని షాట్స్ అయితే నిజంగానే మాయ చేసాయి. లారీ ముందు ప్రభాస్ బైక్‌పై వచ్చే సీన్.. గన్ పేల్చే సీన్.. చేతిలో కత్తులు పట్టుకున్నపటి సీన్.. ఇవన్నీ గూస్ బంప్స్ అనే పదానికి తక్కువేం కాదు.
రేపు సినిమా కూడా ఇదే రేంజ్‌లో ఉంటే 1000 కోట్లు పరిగెత్తుకుంటూ రావడం ఖాయం. ఎవరు ఔనన్నా కాదన్నా.. ఇన్నాళ్లూ సలార్‌పై ఓ అనుమానం ఉండేది. కానీ ఒక్క ట్రైలర్‌తో అన్నింటికీ జవాబు ఇచ్చేసారు ప్రశాంత్ నీల్. ముఖ్యంగా ప్రభాస్‌ను ఇలా చూసి చాలా ఏళ్లైపోయింది. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో సలార్ వస్తుంది. స్నేహితుడి కోసం ప్రపంచంతో పోరాడే ఫ్రెండ్‌గా నటిస్తున్నారు ప్రభాస్.
ట్రైలర్ చెప్పిన టైమ్ గంటన్నర ఆలస్యంగా రావడంతో.. ప్రశాంత్ నీల్ అండ్ టీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆడుకున్నారు. కానీ వర్త్ వర్మ వర్త్ అన్నట్లు.. ట్రైలర్ చూసాక వాళ్లు సైలెంట్ అయ్యారు. ఎదురుగా డంకీ ఉన్నా.. సలార్‌పై అంచనాలైతే మామూలుగా లేవు. మొత్తానికి చూడాలిక.. ప్రభాస్ విశ్వరూపం ఎలా ఉండబోతుందో..?