
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ కాయదు లోహర్. కొన్ని రోజుల క్రితం విడుదలైన డ్రాగన్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు.

డ్రాగన్ సినిమా తర్వాత ఈ అమ్మడు వరుస ఆఫర్స్ అందుకుంది. ఇప్పటికే తెలుగులో ఓ ఆఫర్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్వక్ సేన్, అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీ సినమాలో ఛాన్స్ అందుకుంది.

ఫంకీ సినిమానే కాకుండా ఇప్పుడు తమిళ్ హీరో శింబు సరసన నటించే అవకాశం అందుకుంది కాయదు లోహర్. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు, తమిళంలో ఈ అమ్మడు జోరు మీదు దూసుకుపోతుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో జోరు చూపిస్తున్న ఈ వయ్యారి.. తాజాగా తెలుగులో మరో క్రేజీ సినిమాలో చేరినట్లుగా తెలుస్తోంది. నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ది ప్యారడైజ్ సినిమాలో ఎంపికైనట్లు టాక్.

ఇప్పటికే ఈ విషయంపై సంప్రదింపులు జరిగాయని.. ఆమె నుంచి సానుకూల స్పందన వచ్చిందని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది.