Anushka Shetty: అనుష్క ఎందుకు ప్రమోషన్‌కు రావట్లేదనే అనుమానాలు.. ఒక్క సింగిల్ ఇంటర్వ్యూతో చెక్ పెట్టిన జేజమ్మ..
అనుష్క ఎక్కడుందబ్బా.. సినిమా విడుదలవుతున్నా కూడా ఆమె ప్రమోషన్‌కు రావట్లేదనే అనుమానాలు చాలా రోజులుగా అందరిలో ఉన్నాయి. దీనిపై మేకర్స్ ఏం మాట్లాడట్లేదు. చివరికి ఈ డౌట్స్‌కు స్వయంగా జేజమ్మే సమాధానమిచ్చారు. ఒకే ఇంటర్వ్యూలో ప్రేమ, పెళ్లి, ప్రభాస్‌తో స్నేహం.. ఇలా చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ అనుష్క ఏమన్నారు..? ఇకపై సినిమాలు చేస్తారా..? అనుష్క శెట్టి ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్ళు కావొస్తుంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ ఐదేళ్ల గ్యాప్ అయితే తీసుకోలేదు. హిట్టు ఫ్లాపులతో పనిలేకుండా వరస సినిమాలైతే చేసారు. కానీ కెరీర్‌లో ఫస్ట్ టైమ్ లాంగ్ గ్యాప్ తీసుకున్నారు జేజమ్మ.