
ఇటీవల సినీ ప్రముఖుల చిన్ననాటి ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. తమ ఫెవరెట్ హీరోయిన్స్ ఫోటోలను అభిమానులు నెట్టింట పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఓ బ్యూటీ చిన్ననాటి ఫోటో వైరల్ గా మారింది ఆమె ఎవరో కనిపెట్టరా.?

పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు.. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. ఈ బ్యూటీ చిన్ననాటి ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.కాజల్ అగర్వాల్ జూన్ 19, 1985న ముంబైలో జన్మించారు. కాజల్ మొదట్లో టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో మోడల్‌గా నటించింది అలాగే 2004లో విడుదలైన హిందీ చిత్రం "హో గయా నా"లో సినీ రంగ ప్రవేశం చేసింది.

ఆ తర్వాత 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీని తరువాత, దాని తర్వాత కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా కాజల్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. చందమామ సినిమా హిట్ అవ్వడంతో కాజల్ కు క్రేజీ ఆఫర్స్ వచ్చాయి.

చందమామ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో అవకాశం అందుకుంది. ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. దాంతో కాజల్ కు స్టార్ డమ్ వచ్చింది. దాంతో తెలుగుతో పాటు తమిళ్, హిందీ వంటి ఇతర భాషల్లో చిత్రాల్లో నటించడం ప్రారంభించింది.

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించింది కాజల్. ఆ తర్వాత 2020లో ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుంది. ఆమె వివాహం తరువాత, ఆమె సినిమాల్లో నటించడం తగ్గించింది.

బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు దర్శకుడు ముఖేష్ కుమార్ తెరకెక్కిస్తున్న మంచు విష్ణు కన్నప్పలో నటిస్తుంది.