ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్. తెలుగు కంటే ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది. ఆమె మరెవరో కాదు.. యువీనా పార్థవి.
తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోస్ అందరి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మెరిసింది. అమాయకపు మాటలు, అల్లరి చేష్టలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
చదువుల కోసం చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న యువీనా.. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు కథానాయికగా వెండితెరపై సందడి చేస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది యువీనా. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోస్, ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు క్రేజీ ఫోటోస్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్.
ఒకప్పుడు ఎంతో ముద్దుగా కనిపించిన ఈ అమ్మాయి.. ఇప్పుడు గ్లామర్ ఫోజులతో నెట్టింట అరాచకం సృష్టిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2013లో ఇవాన్ ఏ కమల్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది యువీనా.