
ఒకప్పుడు తన నటనతో బాలీవుడ్‌నే షేక్ చేసిన ముద్దుగుమ్మ జూహీ చావ్లా. ఈ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ నటి సొంతం. ఒకప్పుడు బాలీవుడ్‌లో వరస సినిమాలతో దూసుకపోయింది ఈ ముద్దుగుమ్మ.

1986లో సుల్తాన్‌తో వెండితెరకు పరిచయమైన ఈ నటి, పతర్వాత రెండేళ్ల గ్యాప్ తో రొమాంటిక్ మూవీ ఖయామత్ సే ఖయామత్ అనే సినిమాతో ఆకట్టుకుంది. అమీర్ ఖాన్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా అమ్మడి కెరీర్‌ను కీలక మలుపు తెప్పింది.

ఇక ఈ మూవీ తర్వాత ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూడలేదు. వరసగా బాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ, స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అంతే కాకుండా వరసగా సినిమాలు చేస్తూ, మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ అమ్మడు అంటే ఇష్టపడేవారు చాలా మంది ఉంటారు. అంతలా అందరినీ తన నటన, అందంతో మాయ చేసింది.

ఇక ఓ వైపు సినిమాలు, మరో వైపు బిజినెస్‌లు చేస్తూ ఈ మద్దుగుమ్మ చాలా ఆస్తులు సంపాదించిందంట. అంతే కాకుండా ఇండియాలోనే రిచెస్ట్ బ్యూటీగా ఈ నటి రికార్డ్స్ క్రియేట్ చేసింది. దాదాపు ఈ అమ్మడు ఆస్తులు 4,600 కోట్లు పైనే ఉంటాయని సమాచారం. అనేక వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి జూహీ చావ్లా చాలా డబ్బు సంపాదించిందంట. అంతే కాకుండా ఈ నటి భర్త మెహతాకు కూడా ముంబై , ఫోర్ బందర్‌లో లగ్జరీ హౌజ్‌లు, రెస్టారెంట్స్ ఉన్నట్లు తెలుస్తున్నాయి.

అయితే రీసెంట్‌గా విడుదలైన ఓ నివేదిక ప్రకారం, హీరోయిన్లలో అత్యధిక ఆస్తులున్న నటిగా జూహీచావ్లా మొదటి స్థానంలో ఉన్నదంట. దాదాపు ఈ ముద్దుగుమ్మకు 4,600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.