
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. అవకాశాలు వచ్చినా కూడా హీరోయిన్ గా రాణించలేకపోతున్నారు కొందరు. మరికొందరు హిట్ వచ్చినా కూడా ఆఫర్స్ అందుకోలేకపోతున్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు.

తెలుగులో ఐదు సినిమాలు చేసింది. అందులో ఒకటి బ్లాక్ బస్టర్.. ఏకంగా 300కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ఆ సినిమా. కానీ ఈ అమ్మడికి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. అలాగే అవకాశాలు కూడా అంతగా రావడమా లేదు.. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

అమృత అయ్యారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోయిన్ గా మారింది ఈ చిన్నది. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆతర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ బ్యూటీ.. తెలుగులోనూ ఆఫర్స్ అందుకుంది.

రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత ముపై రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేసింది. ఆతరువాత హనుమాన్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

హనుమాన్ సినిమా ఏకంగా 300కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ అమ్మడికి మాత్రం అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఇప్పుడున్న హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతున్నారు. అంత పెద్ద హిట్ కొట్టనా కూడా ఈ చిన్నది ఇంకా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇటీవలే బచ్చల మల్లి అనే సినిమా చేసింది. కానీ ఆ సినిమా నిరాశపరిచింది.