
సినీరంగంలో సైనిక కుటుంబాల నుంచి వచ్చిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. తమ తండ్రులు ఆర్మీలో సేవలు అందిస్తుండగా.. కొందరు నటీమణులు మాత్రం తమదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. మరీ సైనిక కుటుంబాల నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన తారలు ఎవరో తెలుసుకుందామా.

అనుష్క శర్మ.. ఆమె తండ్రి కల్నల్ అజయ్ కుమార్ శర్మ భారతసైన్యంలో పనిచేసేవారు. అందుకే చిన్నప్పటి నుంచి తమ ఇంట్లో క్రమశిక్షణకు ఎంతో ప్రాముఖ్యత ఉండేదని అనుష్క శర్మ గత ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.

ప్రియాంక చోప్రా తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా. సైన్యంలో జవాన్లకు వైద్య సేవలు అందించేవారు. తన తండ్రి గురించి అనేక ఇంటర్వ్యూలలో గొప్పగా చెప్పింది ప్రియాంక.

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి రాజేందర్ సింగ్ సైతం భారత ఆర్మీ అధికారి. తన తండ్రి క్రమశిక్షణ, ప్రేమ గురించి అనేక సార్లు చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ హీరోయిన్ నిమ్రత్ కౌర్ తండ్రి మేజర్ భూపిందర్ సింగ్. భారత్య సైన్యంలో పనిచేశారు. 1994లో ఉగ్రవాదులు ఆయనను కిడ్నాప్ చేసి హతమార్చారు.

సుష్మితా సేన్ సైతం సైనిక కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి వింగ్ కమాండర్ షుబీర్ సేన్ భారత వైమానిక దళంలో పనిచేశారు. సుష్మితా ఎయిర్ ఫోర్స్ గోల్డెన్ జూబ్లీ ఇన్స్టిట్యూట్‌లో చదువుకున్నారు.