Jr.NTR: నెట్టింట ఆ ఇద్దరినే ఫాలో అవుతున్న ఎన్టీఆర్.. ఆ ఒక్కరు చాలా స్పెషల్..

|

Feb 08, 2025 | 12:58 PM

తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఎలాంటి పాత్రలోనైనా ప్రాణం పెట్టి నటించడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. గతేడాది దేవర సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

1 / 5
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించిన తారక్.. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

2 / 5
వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే దేవర పార్ట్ 2 షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.

3 / 5
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఎప్పుడో ఒకసారి పోస్ట్ చేస్తుంటారు. నెట్టింట యాక్టివ్ గా ఉండేందుకు తారక్ అసలు ఇష్టపడరు. అయినప్పటికీ ఈ హీరోను ఫాలో అయ్యేవాళ్ల సంఖ్య మిలియన్లలో ఉంటుంది.

4 / 5
తారక్ కు ఇన్ స్టాలో 7.4 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇన్ స్టాలో ఎన్టీఆర్ ఏ ఒక్కరిని ఫాలో కావడం లేదు. ఇక ఫేస్ బుక్ విషయానికి వస్తే అతడికి 6.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

5 / 5
కానీ ఎన్టీఆర్ మాత్రం ఫేస్‌బుక్‌లో కేవలం రెండు ఖాతాలను మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో ఒకటి డైరెక్టర్ రాజమౌళి కాగా.. మరొకటి ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్. ఇక ట్విట్టర్ లో కేవలం రాజమౌళిని మాత్రమే ఫాలో అవుతున్నారు.