
భారతీయ సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న హీరోయిన్ జెనీలియా. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో అత్యంత ఫిట్ గా ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇటీవల తన అందానికి రహస్యం వెల్లడించింది. ఆమె ఫిట్‌గా ఉండటానికి ప్రతిరోజూ వ్యాయామం చేస్తుంది. అలాగే పౌష్టిక ఆహారం తీసుకుంటుంది. జెనీలియా ఒకప్పుడు ఆరు వారాల్లో నాలుగు కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది.

జెనీలియా ఆహారంలో కాలానుగుణ పండ్లు, కూరగాయలు, డేట్స్ తీసుకుంటుంది. ఒకేసారి ఎక్కువగా తినడం కంటే ప్రతి కొన్ని గంటలకు తినడం ముఖ్యం. జెనీలియా అల్పాహారంలో దక్షిణాది వంటకాలు ఉంటాయి. జెనీలియా ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మరిగించిన నీటిని తాగుతుంది.

బరువు తగ్గడానికి జెనీలియా జిమ్‌లో చాలా సమయం గడిపింది. జెనీలియా కూడా డ్యాన్స్ ద్వారా వ్యాయామం చేయడానికి ఇష్టపడుతుంది. రీరంపై ఒత్తిడి లేకుండా ప్రతిరోజూ కొద్దిపాటి వ్యాయామం చేస్తుంది. జెనీలియా తనను తాను హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగుతుంది.

జెనీలియా ఆహారంలో కేవలం శాఖాహారం మాత్రమే ఉంటుంది. నాన్ వెజ్ కు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన బ్యూటీఫుల్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే జూనియర్ సినిమాతో తెలుగు తెరకు రీఎంట్రీ ఇచ్చింది.