
దక్షిణాది సినీప్రియులకు పరిచయం అవసరంలేని హీరో శివకార్తికేయన్. ఇటీవలే అమరన్ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఇందులో ముకుంద్ వరదరాజన్ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించారు.

శివకార్తికేయన్ ఫిబ్రవరి 17, 1985న జన్మించారు. తిరుచ్చిలో చదువు పూర్తి చేసుకున్న శివకార్తికేయన్ ఉద్యోగ రీత్యా చెన్నైకి వచ్చాడు. ఆ తర్వాత స్మాల్ స్క్రీన్‌పై యాంకర్‌గా, కామెడీ షోలలో పాల్గొన్నాడు.

స్మాల్ స్క్రీన్‌పై అరంగేట్రం చేసి ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టిన శివకార్తికేయన్ ఇప్పుడు తమిళ సినిమా టాప్ 10 హీరోల్లో ఒకడు కావడం గమనార్హం. 2012లో పాండ్యరాజ్ దర్శకత్వం వహించిన మెరీనా సినిమాతో హీరోగా మారాడు.

ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారాడు. ఇప్పటివరకు 22 చిత్రాల్లో నటించాడు. హీరోగానే కాకుండా శివకార్తికేయన్ మంచి సింగర్ కూడా.

శివకార్తికేయన్ కు ఇన్ స్టాలో 8.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ ఆయన మాత్రం తన భార్య ఆర్తీని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇక తన నటించిన హీరోయిన్స్, ఇతర హీరోలను శివకార్తికేయన్ ఫాలో కావడం లేదు.