Sharmin Segal Mehta: హీరామండి నటి రూ.53 వేల కోట్లకు మహారాణి.. ఈ బ్యూటీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవ్వాల్సిందే..
డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి వెబ్ సిరీస్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్ కీలకపాత్రలు పోషించారు. ఇందులో షర్మిన్ అలంజేబ్ పాత్రను పోషించింది షర్మిన్. అయితే నటనపరంగా షర్మిన్ పై విమర్శలు వస్తున్నాయి. కానీ ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్. షర్మిన్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ చెల్లెలి కూతురు.