
లేడీ సూపర్ స్టార్ నయనతార పుట్టినరోజు (నవంబర్ 18న) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్రకథానాయికగా కొనసాగుతున్న ఈ హీరోయిన్ గురింతి ఆమె భర్త విఘ్నేష్ శివన్ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.

పెళ్లి.. పిల్లల తర్వాత నయన్ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది. ఈ క్రమంలోనే తన భార్యకు బర్త్ డే విషెష్ తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా ఆమెపై తనకున్న ప్రేమను మరోసారి వ్యక్తం చేశారు.

నీతో నాకు 9 ఏళ్ల పరిచయం. నీ బర్త్ డే నాకెంతో ప్రత్యేకం. మరిచిపోలేని జ్ఞాపలకాలవి. ఈరోజు అంతకన్న స్పెషల్. ఎందుకంటే ఈ సంవత్సరం మనం భార్యభర్తలుగా ప్రయాణాన్ని ప్రారంభించాం. అలాగే ఇద్దరు పిల్లలకు తల్లీదండ్రులయ్యాం.

నువ్వెంతటి శక్తిమంతమైన వ్యక్తివో నాకు తెలుసు.. ఆత్మ విశ్వాసం.. అంకిత భావంతో పనిచేస్తుంటావు. నిజాయితీ.. చిత్తశుద్ధితో ముందుకెళ్తూ స్పూర్తి నింపావు. ఓ తల్లిగా నువ్వు ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నావు.. ముందు కంటే మరింత అందంగా కనిపిస్తున్నావు.

మన పిల్లలు నిన్ను ముద్దాడుతారు. కాబట్టి నువ్వు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇక. నీ ముఖంపై చిరునవ్వు.. ఆనందం ఎప్పటికీ అలాగే ఉండాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను. నేను జీవితంలో స్థిరపడ్డానని అనిపిస్తోంది. లైఫ్ అందంగా.. సంతృప్తిగా ఉంది.

ఈరోజు ఉన్నంత సంతోషమే మన పిల్లలతో పుట్టిన రోజున ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మై లేడీ సూపర్ స్టార్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం విఘ్నేష్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.

నయనతార ప్రస్తుతం నటిస్తోన్న లేటేస్ట్ చి త్రం కనెక్ట్. అశ్విన్ శరవనన్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

నయనతార సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం హిందీలో షారుఖ్ ఖాన్‌తో జవాన్ సినిమా చేస్తోంది.