
దర్శక ధీరుడి రాజమౌళి డైరెక్షన్‌లో చేయాలనీ ఎవరికీ మాత్రం ఉండదు. చిన్న పాత్ర అయినా సరే అవకాశం వస్తే చాలు అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అపజయం అంటూ లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు రాజమౌళి. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పాన్ ఇండియా హిట్, ఇప్పుడు గ్లోబల్ రేంజ్ హిట్ అంటూ తన సినిమాలతో పాటు తెలుగు సినిమా స్థాయిని పెంచుకుంటూ రాణిస్తున్నారు.

ఆయన సినిమాలో నటించాలని స్టార్ హీరోలు, హీరోయిన్స్ కూడా క్యూలో నిలబడతారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం రెమ్యునరేషన్ కారణంగా రాజమౌళి సినిమాకు నో చెప్పిందట. రాజమౌళి సినిమాలో అవకాశం రావడమే గొప్ప అంటే రెమ్యునరేషన్ కారణంగా ఓ స్టార్ హీరోయిన్ ఆయన సినిమాకు నో చెప్పిందట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా నటించింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. బాహుబలి సినిమాలో శివగామి రోల్ కోసం ముందుగా శ్రీదేవి సంప్రదించారట రాజమౌళి. శ్రీదేవి ఆ పాత్ర చేస్తే సినిమాకు మరింత వెయిట్ వస్తుందని భావించాడట జక్కన్న.

అయితే బాహుబలి సినిమా కోసం శ్రీదేవి రూ.8 కోట్లు డిమాండ్ చేసిందట. అలాగే సినిమాలో షేర్ కూడా అడిగిందట. వీటితోపాటు ఆమె హోటల్ బిల్లులు, ఫైట్ ఛార్జ్ లు అన్ని కలుపుకొని దాదాపు రూ. 15కోట్ల వరకు అవుతున్నాయట. దాంతో ఆమె ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారట. సినిమా బడ్జెట్ చాలా పెద్దది ఇప్పుడు ఇలా శ్రీదేవి ఒక్కరికే అన్ని కోట్లు పెట్టాలంటే మరింత భారం అవుతుందని మేకర్స్ భావించారట.

అయితే శివగామి పాత్రలో రమ్యకృష్ణ ఇరగదీశారు. శ్రీదేవి ఆపాత్ర ఒప్పుకోకపోవడం మంచిదైంది అని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అలాగే ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి మాట్లాడుతూ.. రెమ్యునరేషన్ కోసం సినిమా ఒప్పుకోవడం అనేది నిజం కాదు అని అన్నారు.