
బాహుబలి తరువాత లాంగ్ బ్రేక్ తీసుకొని ట్రిపులార్ సినిమా చేశారు రాజమౌళి. ఇద్దరు హీరోలతో చేసిన ఈ సినిమా కూడా బాహుబలి 2 రేంజ్‌లో పెర్ఫామ్ చేయలేకపోయింది. ఓవరాల్‌గా 1300 కోట్ల వసూళ్ల దగ్గరే ఆగిపోయింది ట్రిపులార్.

సినిమాల్లో భారీ స్థాయిలో గ్రాఫిక్స్‌ను వాడటం మొదలు పెట్టింది కూడా జక్కన్నే. ఇప్పుడు కొత్తగా ఏఐ ట్రైనింగ్ తీసుకుంటుండటంతో జక్కన్న ఏం చేయబోతున్నారన్నది మరింత ఆసక్తికరంగా మారింది.

కొన్ని కొన్ని డయాస్‌ల మీద నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి చెప్పక తప్పడం లేదు రాజమౌళికి. అలా ఆయన ఎక్కడో చెప్పిన విషయాలనే ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్.

ఆల్రెడీ స్క్రిప్ట్ ని లాక్ చేసేశారు. షెడ్యూల్స్ ప్లానింగ్ కూడా కంప్లీట్ అయిందన్నది ఖుషీ ఖబర్. జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను స్టార్ట్ చేసేయాలన్న పట్టుదలతో ఉన్నారట జక్కన్న.

నెక్స్ట్ సినిమా కోసం అన్ని విధాలా కొత్తగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. ఆ మధ్య డిక్షన్ క్లాసులకు హాజరయ్యారు. యాక్షన్ పరంగానూ, ఫిజిక్ పరంగానూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెవర్ బిఫోర్ సీన్ అవతార్‌లో కనిపించడానికి సిద్ధమవుతున్నారు.

మహేష్ సినిమా కోసం లొకేషన్లు వెతికే పనిలో పడ్డారు జక్కన్న అనేది ఇప్పుడు వైరల్ న్యూస్. మా సూపర్‌స్టార్‌తో జక్కన్న చేస్తున్న సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ ఓ కొలిక్కి వచ్చేశాయోచ్ అని సంబరపడుతున్నారు అభిమానులు.

వేట మొదలైంది అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఘట్టమనేని అభిమానులు. ఇప్పుడు కొత్తగా మొదలైన వేట ఏంటా అని ఆసక్తిగా చూస్తున్నారు మూవీ లవర్స్.