Harish Shankar: బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు

|

Jan 10, 2025 | 1:30 PM

మిస్టర్ బచ్చన్ తర్వాత హరీష్ శంకర్ పూర్తిగా ఖాళీ అయిపోయారు. పవన్ కళ్యాణ్‌తో సినిమా ఉన్నా.. అది ఎప్పటికి పట్టాలెక్కుతుందో తెలియదు. మరి ఇలాంటి సమయంలో ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి..? ఎవరితో సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు..? పవన్ కోసం అలాగే వేచి చూస్తారా లేదంటే మరో హీరోను పట్టుకుంటారా..?

1 / 5
గద్దలకొండ గణేష్ వచ్చిన నాలుగేళ్ళ తర్వాత గానీ మిస్టర్ బచ్చన్ సినిమా చేయలేకపోయారు హరీష్ శంకర్. మధ్యలో పవన్ సినిమా కమిటైనా.. ఆయన రాజకీయాల కారణంగా అది అలాగే ఉండిపోయింది.

2 / 5
పైగా తాను డేట్స్ ఇచ్చే సమయానికి హరీష్ శంకర్ దగ్గర కథ లేదంటూ ఓపెన్‌గానే చెప్పారు పవర్ స్టార్. ఈ లెక్కన ఇప్పట్లో ఉస్తాద్ లేనట్లే. ఆ మధ్య ఆఘమేఘాల మీద ఉస్తాద్ షూటింగ్ మొదలుపెట్టారు హరీష్ శంకర్.

3 / 5
ఫస్ట్ షెడ్యూల్‌లోనే చాలా వరకు సీన్స్ చిత్రీకరించారు. ఇదే ఊపులో మరో నెలరోజులు పవన్ డేట్స్ ఇచ్చుంటే ఈ పాటికి సినిమా వచ్చి ఏడాది అయిపోయుండేదేమో..? అయితే పవన్ ప్లాన్స్ మరోలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదు.

4 / 5
పవన్ కళ్యాణ్ సినిమా ఆలస్యం అవుతుందనే గతేడాది రవితేజతో మిస్టర్ బచ్చన్ తెరకెక్కించారు హరీష్ శంకర్. రైడ్ సినిమాకు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రం.. డిజాస్టర్ అయింది. రామయ్యా వస్తావయ్య తర్వాత హరీష్ శంకర్‌కు వచ్చిన డిజాస్టర్ ఇదే. ఈ సినిమాతో మోస్ట్ ట్రోల్డ్ డైరెక్టర్‌గానూ మిగిలిపోయారు హరీష్.

5 / 5
బాలయ్యతో ఓ సినిమా కోసం ప్రయత్నిస్తున్నారు హరీష్ శంకర్ ప్రస్తుతం. మిస్టర్ బచ్చన్ టైమ్‌లోనే తనకు బాలయ్యతో ప్రాజెక్ట్ ఉందని తెలిపారు హరీష్. దీనిపైనే ఇప్పుడు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కథ నచ్చితే ట్రాక్ రికార్డు చూడని బాలయ్య.. హరీష్‌కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం ఈయన అఖండ 2తో బిజీగా ఉన్నారు.