
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు సౌత్‌లో ఎంత క్రేజ్ ఉందో... నార్త్‌లోనూ అంతే మంచి ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్‌లోనూ క్రేజీ మూవీస్‌లో నటించిన ఈ వర్సటైల్ స్టార్, అక్కడి మూవీ ఈవెంట్స్‌లోనూ రెగ్యులర్‌గా కనిపిస్తుంటారు.

రీసెంట్ టైమ్స్‌లో అలా ఓ మూవీ ఈవెంట్‌లో పాల్గొన్న ధనుష్, న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఫ్లాష్ అవుతున్నారు.సన్నాఫ్ సర్ధార్ ఈవెంట్‌కు హాజరయ్యారు ధనుష్. ఈ సందర్భంగా ఈ మూవీ హీరోయిన్ మృణాల్‌తో మాట్లాడుతున్న క్లిప్స్ వైరల్ అయ్యాయి.

అంతే... ఈ ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ధనుష్‌కు సంబంధించిన న్యూస్ కావటంతో దక్షిణాదిలో ఈ న్యూస్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ముందు ఈ రూమర్స్‌ను లైట్ తీసుకున్న మృణాల్, ఎంతకీ తగ్గకపోవటంతో ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చారు.

సన్నాఫ్ సర్దార్ ఈవెంట్‌కు ధనుష్ అటెండ్ అవుతున్న విషయం తనకు అసలు తెలియదన్నారు. అజయ్ దేవగన్ ఇన్వైట్ చేస్తేనే ఆయన వచ్చారని, ఈవెంట్‌లో ఫార్మల్‌గా మాట్లాడుకున్నామే తప్ప స్పెషల్ ఏం లేదని క్లారిటీ ఇచ్చారు.

సౌత్‌లో బిజీగా ఉంటూనే నార్త్ ఇండస్ట్రీతోనూ టచ్‌లో ఉంటున్నారు ధనుష్. ప్రజెంట్ ఆనంద్ ఎల్‌రాయ్ దర్శకత్వంలో తేరే ఇష్క్‌మే సినిమాలో నటిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.