
బాలీవుడ్ దీపిక పదుకోన్ గురించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల బాఫ్టా వేడుకలో చీరకట్టులో మెరిసిన ఈ బ్యూటీ లుక్ కొత్త డౌట్స్ రెయిజ్ చేస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇంతకీ ఏంటా డౌట్ అనుకుంటున్నారా..?

సిల్వర్ స్క్రీన్ మీద సూపర్ హిట్స్ ఇచ్చిన దీప్ వీర్... ఆ తరువాత రియల్ లైఫ్‌లోనూ బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్స్ మధ్య రిలేషన్స్ ఫిప్స్ పాసింగ్ క్లౌడ్స్ అన్న అపవాదును చెరిపేస్తూ... చిలకా గోరింకల్లా మీడియా కెమెరాల ముందు సందడి చేస్తున్నారు.

ఛాన్స్ దొరికిన ప్రతీసారి ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపిస్తూ బెస్ట్ జోడి అనిపించుకుంటున్నారు. ఈ జంట ఇప్పుడు లైఫ్‌లో నెక్ట్స్ చాప్టర్‌కు వెల్ కం పలకబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు బెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న దీప్ వీర్, త్వరలో ప్రౌడ్ పేరెంట్స్ కాబోతున్నారన్నది బీటౌన్ నయా న్యూస్.

అఫీషియల్ కన్ఫార్మేషన్ లేకపోయినా.. దీపిక తల్లికాబోతున్నారన్న వార్త మాత్రం సౌత్ నార్త్ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. రీసెంట్‌గా బాఫ్టా వేడుకల్లో పాల్గొన్న దీపిక చీరకట్టులో కనిపించారు.

అయితే ఈ ఫోటోలో బేబీ బంప్ కనిపిస్తుందన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో ఒక్కసారిగా గ్లామర్ వరల్డ్ అలెర్ట్ అయ్యింది. ప్రజెంట్ సౌత్ నార్త్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు దీపికా, ఆమె ప్రెగ్నెన్సీ బ్రేక్ తీసుకుంటే ఆ ఎఫెక్ట్ సినిమాల మీద పడే ఛాన్స్ ఉందంటున్నారు.

ప్రజెంట్ సింగం ఎగైన్ సినిమాలో లేడీ సింగం రోల్‌లో నటిస్తున్నారు దీపిక, సౌత్‌లో మోస్ట్ ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఈ రెండు సినిమాలు త్వరలో పూర్తి కాబోతున్నాయి. ఆ తరువాత దీపిక బ్రేక్ తీసుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలపై దీప్ వీర్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.