
దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్ దీపావళి సందర్భంగా అభిమానులకు ఉత్తమ బహుమతిని అందించారు. ఈ జంట మంగళవారం తమ కుమార్తె దువా పదుకొనే సింగ్ ఫేస్ రివీల్ చేశారు. దీపికా, దువా ఇద్దరూ మెరూన్ కలర్ దుస్తులు ధరించగా.. రణవీర్ సింగ్ తెల్లటి కుర్తా పైజామాలో ధరించి అందమైన చిరునవ్వులతో కట్టిపడేస్తున్నారు.

దీపిక, రణ్‌వీర్ దంపతులకు సెప్టెంబర్ 8, 2024న జన్మించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు 2018లో వివాహం చేసుకున్నారు. గత దీపావళి సందర్భంగా, వారు తమ కుమార్తె పేరు దువా పదుకొనే సింగ్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. "దువా: అంటే ప్రార్థన. ఎందుకంటే ఆమె మా ప్రార్థనలకు సమాధానం. మా హృదయాలు ప్రేమ, కృతజ్ఞతతో నిండి ఉన్నాయి" అని రాశారు.

ప్రస్తుతం దీపికా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తమ కూతురు దువా అందమైన చిరునవ్వుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దీపికా పోస్టులపై అభిమానులు, సినీప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. అనన్య పాండే, “ఓ మై గాడ్ 😍😍😍😍😍” అని కామెంట్ చేశారు. అలాగే దువా ఎంతో అందంగా, ముద్దుగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇదిలా ఉంటే..దీపికా చివరిసారిగా కల్కి 2898 ఏడీ, జవాన్ చిత్రాల్లో కనిపించింది. మరోవైపు అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టుతోపాటు ... హిందీలో షారుఖ్ సరసన మరో సినిమా చేస్తుంది. మరోవైపు ఆదిత్య ధార్ రాబోయే చిత్రం, ఫర్హాన్ అక్తర్ డాన్ 3లో రణవీర్ సింగ్ నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా దీపికా పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తోన్న స్పిరిట్, కల్కి చిత్రాల నుంచి ఆమె తప్పుకోవడంతో ఆమె పై పలు విమర్శలు వచ్చాయి. రోజుకు 8 గంటలు మాత్రమే వర్క్ చేస్తానంటూ ఆమె కండిషన్స్ పెట్టిందని వస్తున్న వార్తలపై ఇటీవల దీపికా స్పందించిన సంగతి తెలిసిందే.