
యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు వకీల్ సాబ్ మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో చాన్స్ కొట్టేసి, స్టార్ స్టేస్ అందుకుంది. దీంతో అందరూ అనన్య కెరీర్ సెట్ అయినట్లే అనుకున్నారు.

కానీ ఈ అమ్మడు ఆ మూవీ తర్వాత పొట్టేల్, తంత్ర, శ్రీకాకుళం షెర్లాక్ హోల్మ్స్, డార్లింగ్ వంటి పలు సినిమాల్లో నటించింది. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు.

మరీ ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మకు వకీల్ సాబ్ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయనుకున్నారు. కానీ అలాంటి ఆఫర్స్ ఏవీ ఈ ముద్దుగుమ్మకు రాలేదు. దీంతో చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వస్తుంది. ఇక ఎప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన వరస ఫొటో షూట్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుంది.

తాజాగా అనన్య నాగళ్ల వైట్ అండ్ బ్లాక్ కలర్ ట్రెండీ డ్రెస్‌లో ఉన్న క్యూట్ ఫొటోస్‌ను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ చాలా స్టైలిష్‌గా క్యూట్‌గా కనిపిస్తుంది.

దీంతో తన అభిమానులు, క్యూట్, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓలుక్ వేయండి.