
ఇవన్నీ పూర్తి చేయడంతో పాటు ప్యారలల్‌గా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేయాలన్నది మేకర్స్ ప్లాన్. డిసెంబర్ 6 ఎప్పుడెప్పుడు వస్తుందా? పుష్ప సీక్వెల్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు ప్యాన్ ఇండియా ప్రేక్షకులు.

ఇక రికార్డులు లెక్కపెట్టుకోవడమే.. పుష్ప దిరైజ్‌తో బార్డర్‌లు దాటిన ఇమేజ్‌తో.. ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని క్రేజ్‌తో దూసుకపోతున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప-2'లో అద్వితీయమైన నటన కోసం, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ టేకింగ్..మేకింగ్.. కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

డిసెంబర్ 6న సిల్వర్ స్క్రీన్ మీద గంధపు చెక్కల ఘుమఘుమలను ఆస్వాదించడానికి మేం రెడీ అనే సిగ్నల్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. ప్యాన్ ఇండియా రేంజ్‌లో పుష్ప2 కోసం వెయిటింగ్ బాగానే కనిపిస్తోంది.

ఒకవేళ ఇప్పటిదాకా ఉన్నా లేకున్నా, మేం అంటూ దిగాక అన్నీ సాధ్యపడాల్సిందేనని ట్రెండ్ చేస్తోంది అల్లు ఆర్మీ. పుష్ప2 ఇప్పుడు నేషనల్ లెవల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

పుష్ప3కి కావాల్సిన పర్ఫెక్ట్ హుక్‌ని పుష్ప సీక్వెల్ ఎండింగ్‌లో సుకుమార్ ప్లాన్ చేశారన్నది ఫిల్మ్ నగర్‌లో వైరల్ న్యూస్. ఈ ఏడాది వెయ్యి కోట్ల మార్క్ దాటే సత్తా ఉన్న సినిమాగా ఆల్రెడీ పుష్ప సీక్వెల్ ప్రచారంలో ఉంది.