
ఒకప్పుడు హీరోగా, కమెడియన్, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు సుధాకర్. ఒక వెరైటీ స్లాంగ్ తో ఆయన చెప్పిన డైలాగులు, ఆ మేనరిజాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలాడు సుధాకర్.

అయితే ఆ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడం, తదితర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో సినిమాలకు దూరమయ్యాడు సుధాకర్. ఆయన సినిమాలకు దూరమై సుమారు 17 ఏళ్లు అవుతోంది.

ఇదిలా ఉంటే సుధాకర్ ఒక్కగానొక్క కుమారుడు బెనెడిక్ట్ మైఖేల్ (బెన్నీ) వివాహం గ్రాండ్ గా జరిగింది. క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వివాహ వేడుకకి జగపతి బాబు, బ్రహ్మానందం, జేడీ చక్రవర్తి, రోజా రమణి, చంద్రబోస్ దంపతులు సహా పలువురు సెలబ్రెటీలు హాజరయ్యారు

ముఖ్యంగా బ్రహ్మానందం అయితే తన స్నేహితుడి కుమారుడి పెళ్లి దగ్గరుండి చేశారు. పెళ్లి పనులు ప్రారంభమైనప్పటి నుంచి వేడుకలు ముగిసేదాకా అన్నీ తానై వ్యవమరించారు.

అంతేకాదు తనదైన శైలిలో నూతన దంపతులతో జోకులు వేస్తూ అతిథులందరినీ నవ్వించారు. ప్రస్తుతం సుధాకర్ కుమారుడి వివాహ వేడుకకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ఫొటోల్లో సుధాకర్ చాలా బక్కచిక్కిపోయి కనిపించారు. కనీసం నడవలేని దీన స్థితికి చేరుకున్నారు. దీంతో ఇద్దరి సాయంతో పెళ్లి వేదికపైకి సుధాకర్ ను తీసుకురావాల్సి వచ్చింది.