
టాలీవుడ్ స్టార్ కమెడియన్, నటుడు అలీ కుమార్తె ఫాతిమా వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి పెళ్లి వేడుకలో సందడి చేశారు. అలాగే నాగార్జున, అమల దంపతులు, మంత్రి రోజా, వెంకటేశ్, బ్రహ్మానందం, బండ్లగణేశ్, నరేష్, పీవీ సింధు, రాఘవేంద్రరావు తదితరులు నూతన వధూవరులకు హాజరై అభినందనలు తెలిపారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమా తారలతో పాటు అభిమానులు, నెటిజన్లు ఫాతిమా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా తమ కూతురు పెళ్లికి రావాలని అలీ, జుబేదా దంపతులు ఏపీ సీఎం జగన్‌తో పాటు గవర్నర్ తమిళిసై మెగాస్టార్ చిరంజీవి, రేవంత్ రెడ్డి తదితర సెలబ్రిటీల ఇంటికి వెళ్లి స్వయంగా ఆహ్వానించారు

కూతురు జ్యువెలరీ షాపింగ్ నుండి హల్దీ వేడుకల వరకు, వెడ్డింగ్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా అభిమానులకు తెలియజేస్తోంది అలీ సతీమణి జుబేదా

ఇటీవలే అలీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా ముఖ్య సలహాదారుగా నియామితులయ్యారు. అలీ, జుబేదా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె ఫాతిమా రెమీజు మెడిసిన్ చదువుతోంది.ఇక అలీకి కాబోయే అల్లుడు కూడా డాక్టరే