
మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ విక్రమ్ హీరోగా ఓ సినిమా మొదలైంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకు బైసన్ అనే పేరు పెట్టారు మేకర్స్. ఇందులో ధ్రువ్.. కబడ్డీ ప్లేయర్‌గా నటిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు మారి సెల్వరాజ్.

అందుకే కమర్షియల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు జూనియర్ చియాన్. సెకండ్ మూవీతోనే తనలోని వర్సటాలిటీని చూపించారు యంగ్ హీరో ధృవ్ విక్రమ్.

అర్జున్ రెడ్డి రీమేక్‌తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ధృవ్.. రెండో సినిమాలోనే తండ్రి విక్రమ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మహాన్ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో నటించిన ధృవ్‌కు సెంట్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చారు క్రిటిక్స్.

మహాన్ సినిమాలో ధృవ్ పెర్ఫామెన్స్‌కు ఫిదా అయిన ఆడియన్స్... సౌత్ సినిమాకు మరో వర్సటైల్ హీరో దొరికారంటు కితాబిచ్చారు. ఆల్రెడీ ఆదిత్య వర్మతో రొమాంటిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు ధృవ్.

తరువాత మహాన్ సినిమాతో సిన్సియర్, సీరియస్, నెగెటివ్ షేడ్స్ కూడా చూపించి మెప్పించారు. అయితే ధృవ్ యాక్టింగ్‌కు మంచి మార్కులే పడ్డా కమర్సియల్ స్టార్ అన్న ట్యాగ్ అయితే దక్కలేదు.

అర్జున్ రెడ్డి రీమేక్‌గా తెరకెక్కిన ఆదిత్య వర్మకు పాజిటివ్ టాక్ వచ్చినా.. భారీ వసూళ్లు సాధించలేకపోయింది. ఇక మహాన్ డిజిటల్ రిలీజ్ కావటంతో ధృవ్ మార్కెట్ స్టామినా ఏంటన్న విషయంలో ఇంత వరకు క్లారిటీ రాలేదు.

అందుకే మామన్నన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు ధృవ్. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ధృవ్ కెరీర్‌ను గాడిలో పెడుతుందేమో చూడాలి.