
కోవిడ్ టైమ్స్ లో అదర్ లాంగ్వేజెస్‌లోనూ సూపర్‌డూపర్ హిట్ అయిన సినిమా లూసిఫర్. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. ఎప్పుడో ముహూర్తం షాట్ తీయాల్సింది కానీ, పృథ్విరాజ్ యాక్సిడెంట్ వల్ల కాస్త ఆలస్యమైంది. అయినా, బేఫికర్... నేను 100 పర్సెంట్ కష్టపడటానికి రెడీగా ఉన్నా. ఎల్2ని మొదలుపెట్టేద్దాం అంటూ హింట్ ఇచ్చారు కెప్టెన్ పృథ్వి.

మలయాళం సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలో, పొలిటికల్ మూవీస్ జానర్‌లో స్పెషల్ ప్లేస్ ఉంది లూసిఫర్ సినిమాకి. స్టేట్‌లో పాలిటిక్స్, ఫ్యామిలీలో పాలిటిక్స్, అన్నా చెల్లెలి మధ్య కోపతాపాలు, ప్రేమానుబంధాలు... ఇలా అన్నిటినీ చూపించిన సినిమా లూసిఫర్.

లూసిఫర్ తర్వాత మోహన్‌లాల్‌తో బ్రో డాడీ అనే సినిమా చేశారు పృథ్విరాజ్ సుకుమారన్. బ్రో డాడీకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి లూసిఫర్ సీక్వెల్‌తో సెట్స్ మీదకు వెళ్తున్నారు పృథ్వి అండ్ లాల్. లూసిఫర్, బ్రోడాడీని మించి ఎల్2 ఎంపురాన్ సక్సెస్‌ని అందుకుంటుందనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది వీరిద్దరిలో.

లూసిఫర్‌ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ పేరుతో తెరకెక్కించారు. చిరు చెల్లెలి కేరక్టర్‌లో మెప్పించారు నయనతార. ఒరిజినల్‌లో పృథ్విరాజ్ చేసిన కేరక్టర్‌ని తెలుగులో సల్మాన్ ఖాన్ చేశారు. తార్ మార్ టక్కర్ మార్ అంటూ దుమ్మురేపారు.

కేరళలో ఎల్2 షూట్ మొదలవుతుందంటే, మెగా అభిమానుల్లోనూ ఒక రకమైన సందడి కనిపిస్తోంది. మెగా బాస్‌కి సూట్ అయ్యే ఇంకో స్టోరీ రెడీ అవుతుందనే ఉత్సాహం కనిపిస్తోంది అభిమానుల్లో. ఇంతకీ మెగాస్టార్ ఎల్2ని రీమేక్ చేస్తారా? లేకుంటే గాడ్‌ఫాదర్‌కి సూట్ అయ్యే కథను ఇక్కడే రెడీ చేయిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ...