Chiranjeevi: అనిల్ రావిపూడితో సినిమా ప్లాన్ చేస్తున్న చిరు

| Edited By: Phani CH

Dec 24, 2023 | 9:42 PM

ప్లానింగ్ అంటే సీనియర్ హీరోలదే.. వాళ్ల ముందు ఇప్పటి హీరోలు ఏం సరిపోతారు చెప్పండి..? ఏంటి నమ్మరా.. కావాలంటే చిరంజీవి, బాలయ్యలనే తీసుకోండి.. వాళ్ల ప్లానింగ్ చూస్తుంటే మతులు చెడిపోతాయంతే. ఒకప్పుడు కుండ మార్పిడి అనే పద్దతి ఉండేది కదా.. ఇప్పుడదే ఫార్ములా అప్లై చేస్తున్నారు చిరు, బాలయ్య. మరి వాళ్లు చేస్తున్న ఆ ప్లానింగ్ ఏంటి..? ఈ కుండ మార్పిడీలేంటి చూద్దాం పదండి.. ఈ రోజుల్లో హీరోలకు దర్శకులు దొరకడమే కష్టమైపోతుంది.. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలను ముందుగానే లైన్‌లో పెట్టుకుంటున్నారు.

1 / 5
ప్లానింగ్ అంటే సీనియర్ హీరోలదే.. వాళ్ల ముందు ఇప్పటి హీరోలు ఏం సరిపోతారు చెప్పండి..? ఏంటి నమ్మరా.. కావాలంటే చిరంజీవి, బాలయ్యలనే తీసుకోండి.. వాళ్ల ప్లానింగ్ చూస్తుంటే మతులు చెడిపోతాయంతే. ఒకప్పుడు కుండ మార్పిడి అనే పద్దతి ఉండేది కదా.. ఇప్పుడదే ఫార్ములా అప్లై చేస్తున్నారు చిరు, బాలయ్య. మరి వాళ్లు చేస్తున్న ఆ ప్లానింగ్ ఏంటి..? ఈ కుండ మార్పిడీలేంటి చూద్దాం పదండి..

2 / 5
ఈ రోజుల్లో హీరోలకు దర్శకులు దొరకడమే కష్టమైపోతుంది.. ఒక్కొక్కరు రెండు మూడు సినిమాలను ముందుగానే లైన్‌లో పెట్టుకుంటున్నారు. దాంతో హీరోలు కూడా అదే చేస్తున్నారు. ఓ సినిమా పూర్తి కాకుండానే మరో ఇద్దరు దర్శకులు చెప్పే కథలు ఫైనల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, బాలయ్య దర్శకులు తారుమారు అవుతున్నారు. ఒకరి దర్శకుడిని మరొకరు తీసుకుంటున్నారు.

3 / 5
ఈ మధ్యే అనిల్ రావిపూడితో భగవంత్ కేసరితో హ్యాట్రిక్ పూర్తి చేసారు బాలయ్య. ఈ సినిమాతో వరసగా మూడోసారి 100 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించారు నటసింహం. ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి తర్వాతి సినిమా చిరుతో ఉండబోతుందని తెలుస్తుంది. కొన్ని రోజులుగా అనిల్, చిరు కాంబినేషన్‌పై వార్తలొస్తున్నా.. క్లారిటీ రావట్లేదు.

4 / 5
చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి కచ్చితంగా మరో ఏడాదైనా సమయం పడుతుంది. ఈ లోపు మరో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్. దానికోసమే అనిల్ రావిపూడిని లైన్‌లోకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం ఉండే అవకాశాలున్నాయి.

5 / 5
బాలయ్య కూడా ప్రస్తుతం బాబీతో సినిమా చేస్తున్నారు. మొన్నే చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్‌బస్టర్ ఇచ్చారు బాబీ. దాంతో బాలయ్య సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో 1980స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొత్తానికి ఈ సీనియర్ హీరోలిద్దరూ దర్శకులను మార్చుకుంటున్నారు హాయిగా.