
అలనాటి అందాల తార రాధ కుమార్తె ప్రముఖ హీరోయిన్ కార్తీక నాయర్ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. ఆదివారం (నవంబర్ 19)న ఉదయం రోహిత్ మేనన్‌తో కలిసి ఆమె ఏడడుగులు నడిచింది. కేరళలోని తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

కేరళ సంప్రదాయం ప్రకారం జరిగిన కార్తీక- రోహిత్‌ల వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు స్టార్ సెలబ్రిటీలు తరలివచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కార్తీక పెళ్లితో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అలాగే సీనియర్ హీరోయిన్స్ రాధిక , సుహాసిని, రేవతి, మేనక కూడా సందడి చేశారు.

ఇక బాలీవుడ్ నటుడు జాకీ ష్రాప్, కోలీవుడ్ యాక్టర్ భాగ్యరాజ్‌తో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన తారలు తరలివచ్చారు. కొత్త దంపతులను అభినందించి ఆశీర్వదించారు.

ప్రస్తుతం రాధ కూతురి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.