
టాలీవుడ్ స్టైలిస్ట్ శ్రావ్య వర్మ, భారత బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ ల వివాహం హైదరాబాద్ వేదికగా ఆదివారం (నవంబర్ 11) అట్టహాసంగా జరిగింది.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, కీర్తి సురేష్ తదితరులు హాజరయ్యారు.

తాజాగా శ్రీకాంత్- శ్రావ్యల వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు మెగా స్టార్ చిరంజీవి, నాగార్జున తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

అలాగే సందీప్ కిషన్, అడివి శేష్, కొణిదెల నిహారిక, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తదితరులు శ్రావ్య- శ్రీకాంత్ వెడ్డింగ్ రిసెప్షన్ లో తళుక్కుమన్నారు.

ఇక ప్రస్తుతం పుష్ఫ 2 షూటింగ్ లో బిజీగా ఉంటోన్న డైరెక్టర్ సుకుమార్ వీడియో కాల్ ద్వారా కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రస్తుతం శ్రావ్య వర్మ- కిదాంబి శ్రీకాంత్ ల పెళ్లి, రిసెప్షన్ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. సినీ అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలుపుతున్నారు.