
ఇంద్ర మూవీకి సీక్వెల్ కావాలని మణిశర్మ అడగడం, వెంటనే దానికి చిరంజీవి ఓకే చెప్పేయడం, అశ్వనీదత్ యస్ అనడం.. అంతా వేగంగా జరిగిపోయింది.

ఆ డెడ్‌లైన్‌ను రీచ్ అయ్యే స్పీడుతోనే షూటింగ్ పనులు కానిచ్చేశారు. రీసెంట్‌గా మెగాస్టార్ సిక్ అవ్వటంతో విశ్వంభర రిలీజ్ విషయంలో డౌట్స్ రెయిజ్ అయ్యాయి.

కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి డేట్ మిస్ అయ్యే ఛాన్సే లేదంటున్నారు మేకర్స్. మెగా కాంపౌండ్ నుంచి ఇంత కాన్ఫిడెంట్‌గా వార్తలు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

తాజాగా బాలయ్య సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంటుందనే ప్రచారం మొదలైంది. బాబీ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మ్యాగ్జిమమ్ 2024లోనే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.. ఒకవేళ కుదరకపోతే సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బాలయ్య వస్తే మాత్రం పోరు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం. ఎందుకంటే చిరంజీవి ఉన్నారక్కడ. గత పదేళ్ళలో 2017లో ఖైదీ నెం 150, శాతకర్ణి.. 2023లో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో వచ్చి హిట్ కొట్టారు ఈ ఇద్దరూ. 2025లోనూ ఇదే జరిగితే హిట్ కొడతారని నమ్ముతున్నారు మేకర్స్. బయ్యర్లు కూడా అదే కోరుకుంటున్నారు.