- Telugu News Photo Gallery Cinema photos Can You Guess Who Is The Actress In This Viral Photo, She Is Mr. Bachchan Heroine Bhagya Sri Borse
Tollywood: హే వయ్యారి.! ఇది నువ్వేనా.. అందాలతో గత్తరలేపుతోన్న ఈ బ్యూటీ ఎవరో తెల్సా
అయితే మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ కావడంతో.. ఈ అమ్మడికి ఆఫర్స్ రావడం తగ్గాయి. కానీ ఆ సినిమాలో ఆమె నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి. తనదైన అందంతో..
Updated on: Sep 06, 2024 | 11:56 AM

భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పుడీ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒక్క సినిమాతో తన అందంతో మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది. తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది.

అయితే మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ కావడంతో.. ఈ అమ్మడికి ఆఫర్స్ రావడం తగ్గాయి. కానీ ఆ సినిమాలో ఆమె నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి. తనదైన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది భాగ్యశ్రీ బోర్సే.

ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో ‘వీడీ12’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో భాగ్యశ్రీని హీరోయిన్‌గా తీసుకున్నారని టాక్.

అటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న చిత్రంలో కూడా భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకుందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

మరోవైపు సోషల్ మీడియాలో భాగ్యశ్రీ బోర్సే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు సెగలు రేపుతోంది ఈ భామ.




