- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photo, Who is Famous With Mother Role In Tv Serial, She Is Jyothi Roy
Tollywood: ఈ అమ్మడు అరాచకం రా బాబూ.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట ఇలా.. ఈ నటిని గుర్తుపట్టారా..?
బుల్లితెరపై సీరియల్ నటీనటులకు మంచి ఫాలోయింగ్ ఉంటుంది. సినిమాలకు మించి సీరియల్స్ కు రోజు రోజుకీ వ్యూస్ రేటింగ్ అధికంగా ఉంటుంది. అందం, అభినయంతో సినీరంగంలో తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారలు.. సంప్రదాయంగా పద్దతిగా కనిపిస్తూ జనాలకు దగ్గరవుతారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే నటి మాత్రం చాలా ప్రత్యేకం.
Updated on: Jun 16, 2025 | 9:57 PM

తెలుగు రాష్ట్రాల్లో జనాలు ఎక్కువగా ఫాలో అయ్యేది సీరియల్స్. సినీతారల కంటే ఎక్కువగా సీరియల్ బ్యూటీలకు ఫాలోయింగ్ ఉంటుంది. బుల్లితెరపై నిత్యం కొత్త కొత్త తారలు సందడి చేస్తుంటారు. పాజిటివ్ రోల్స్ తో పాటు నెగిటివ్ షేడ్స్ లో విలన్ పాత్రలతో ఇరగదీస్తుంటారు. ముఖ్యంగా బుల్లితెరపై విలన్ పాత్రలకు ఎంతో డిమాండ్ ఉంటుంది.

అలాగే సీరియల్స్ లో కనిపించే నటీనటులను జనాలు విపరీతంగా ఇష్టపడుతుంటారు. అలాంటి వారిలో ఈ నటి కూడా ఒకరు. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన నటి. కొడుకు ప్రేమ కోసం ఆరాటపడే ఓ తల్లి పాత్రలో అద్భుతంగా నటించి జనాలకు దగ్గరయ్యింది. సంప్రదాయంగా చీరకట్టులో సహజ నటనతో కట్టిపడేసింది.

ఆమె నటించిన సీరియల్ కొన్నిరోజుల క్రితమే ముగిసింది. అందులో ఆమె యాక్టింగ్, లుక్స్ తెలుగువారికి తెగ నచ్చేశాయి. అయితే సీరియల్ కు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె కనిపిస్తున్న తీరు చాలా విభిన్నం. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? తనే జగతి మేడమ్.. అలియాస్ జ్యోతిరాయ్.

బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగువారికి దగ్గరయ్యింది. ఈ సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో సహజ నటనతో కట్టిపడేసింది. సీరియల్లో తల్లిపాత్రతో నటించిన ఈ భామ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

సీరియల్లో పద్దతిగా తల్లిపాత్రలో కనిపించిన జ్యోతిరాయ్.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన గ్లామర్ లుక్స్ తో కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో గ్లామర్ టచ్ ఇస్తూ ఫోటోలకు ఫోజులకు ఫోజులిచ్చింది. ఒకప్పుడు సీరియల్లో బొద్దుగా కనిపించిన జ్యోతిరాయ్.. ఇప్పుడు నాజుగ్గా మారి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.




