ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది ఈ హీరోయిన్. ఇన్నాళ్లు ఆడపాదడపా చిత్రాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రాల అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి మరెవరో కాదు.. హీరోయిన్ మీనాక్షి చౌదరి.
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ వయ్యారి.. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటించింది. అడివి శేష్ సరసన హిట్ 2 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి.. ఆ వెంటనే మహేష్ బాబు సరసన గుంటూరు కారం మూవీలో ఛాన్స్ వచ్చింది.
ఇక ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమాతో మరో హిట్టు అందుకుంది మీనాక్షి. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ సినిమాలో దుల్కర్ భార్యగా నటించి ప్రశంసలు అందుకుంది మీనాక్షి.
మరోవైపు వెంకీ కొత్త ప్రాజెక్టులోనూ నటిస్తుంది. ఇవే కాకుండా తెలుగులో మట్కా సినిమాతోపాటు తమిళంలోనూ నటిస్తుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.
నీలిరంగు మోడ్రన్ డ్రెస్సులో అందంగా ముస్తాబయ్యింది మీనాక్షి. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలలో నడుమందాలతో కవ్విస్తోంది నెటిజన్లను కట్టిపడేస్తుంది మీనాక్షి. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్.