
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ?సౌత్ ఇండస్ట్రీలోనే క్రేజీ హీరోయిన్. ఓటీటీ వెబ్ సిరీస్ లో రచ్చ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ బ్యూటీ ఎవరో కాదు.. టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ తమన్నా భాటియా. ప్రస్తుతం ఓదెల 2 చిత్రంలో నటిస్తుంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషనల్లో పాల్గొంటుంది. ఇందులో లేడీ అఘోరి పాత్రలో కనిపించనుంది తమన్నా.

ఇన్నాళ్లు సినిమాల్లో గ్లామర్ పాత్రలతో మెప్పించిన ఈ అమ్మడు హిందీలో మాత్రం లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ లో రొమాంటిక్ సీన్లతో రచ్చ చేసింది. ముఖ్యంగా హీరో విజయ్ వర్మతో కలిసి రొమాంటిక్ సీన్లతో కనిపించింది.

ఈసిరీస్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత వీరిద్దరు బాలీవుడ్ మూవీ ఫంక్షన్స్, పార్టీలలో సందడి చేశారు. కట్ చేస్తే.. కొన్నాళ్లకే వీరిద్దరి లవ్ బ్రేకప్ దిశగా నడిచింది.

ఇప్పుడు వీరిద్దరు విడిపోయినట్లుగా తెలుస్తోంది. ఓదెల 2 మూవీ ప్రమోషన్లలో విజయ్ ప్రస్తావిస్తూ పరోక్షంగా ఓ యాంకర్ ప్రశ్నించగా.. తనదైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది తమన్నా. ప్రస్తుతం తమన్నా నెట్టింట చాలా యాక్టివ్ గా ఉంటుంది.