
సోషల్ మీడియాలో సినీతారలు చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటారు. తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఫోటో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదు.. క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. కానీ హిట్ 2 సినిమాతో ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది.

హిట్ 2 సూపర్ హిట్ కావడంతో మీనాక్షికి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ వెంటనే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాతో అలరించిన మీనాక్షి.. లక్కీ భాస్కర్, మట్కా వంటి చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం వెంకటేశ్ జోడిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే తెలుగులో మరికొన్ని చిత్రాల్లో నటిస్తుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

మీనాక్షి చౌదరి 2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్. అలాగే మీనాక్షి రాష్ట్రాస్థాయిలో టెన్నీస్ ప్లేయర్. కాలేజీ రోజుల్లో ఆమె ఎక్కువగా స్పోర్ట్స్ లో పాల్గొనేదట.