
ఈ అమ్మాయి ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేది. కానీ నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. కథానాయికగా మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ సొంతం చేసుకుంది.

ఆమె మరెవరో కాదు.. అచ్చ తెలుగమ్మాయి అనన్య నాగల్ల. మల్లేశం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంది.

తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య.. హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసింది. అదే సమయంలో షార్ట్ ఫిల్మ్స్ చేసింది.

ఆ తర్వాత ప్రియదర్శి జోడిగా మల్లేశం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీలో కీలక పాత్ర పోషించింది. తెలుగులో మ్యాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో, శాకుంతం, మళ్లీపెళ్లి చిత్రాల్లో నటించింది.

ఇటీవలే పోట్టెల్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.